ఆర్మూర్ మార్చి10: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తరువాతనే అన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు రిలే దీక్షలు – నిరసన కార్యక్రమాలు సోమవారం ప్రారంభించారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట భద్దత కల్పించకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయడం ఆపాలని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్ని నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా మాదిగ నిరుద్యోగులు వర్గీకరణ లేక నష్టపోయారని అన్నారు.గ్రూప్ 1, గ్రూప్ 2 ,గ్రూప్ 3 యొక్క ఫలితాలను ఎస్సీ వర్గీకరణ అమలు పరచకుండా ఫలితాలను విడుదల చేయడం వల్ల మాదిగలకు నిరుద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్ట బద్దత కల్పించి గ్రూప్స్ ఉద్యోగాలలో మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద కపట ప్రేమ ఆపి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్ట భద్దత తెచ్చి మాదిగల పట్ల నిజమైన ప్రేమను చూపాలని చమత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ, మాదిగ మహసేన సంఘం ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నాల చంద్ర శేఖర్(ఎమ్మార్పీఎస్ సీనియర్), ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి, జిల్లా అధ్యక్షుడు గంగాని స్వామి, ఏంఎస్పి నాయకులు సుద్ధపల్లి మార్కు, నాగం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి నుతూపల్లి సంతోష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సంకెపల్లి విప్లవ్, ఎడపల్లి సంతోష్,మచ్ఛర్ల సునీల్ ,తరుణ్, బన్నీ,అజయ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.