ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ మరియు ఆర్మూర్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్ (టైగర్), అల్జాపూర్ కిరణ్ ఆధ్వర్యంలో బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శక్తి కేంద్రం 26,27,వార్డ్ ల ఇంచార్జ్ పెద్దోళ్ల భారత్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది అని పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ తెలిపారు.
ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ పుట్టినరోజు సందర్భంగా వారిని స్వగృహం లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ అగర్వాల్,31 కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వడ్లురి సుమన్ యువజన కాంగ్రెస్ నాయకులు అల్జాపూర్ కిరణ్ , తదితరులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ రమణగారు నిజమైన కాంగ్రెస్ నాయకునిగా ఉన్నారని పార్టీ కి ఎనలేని సేవలు చేసారని, ఎందరో ఎన్నో పార్టీలు మారిన తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీలోనే ఉన్నారంటూ మరియు ఆయన ఆర్మూర్లో మహిళా సంఘాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎలాంటి రిమార్కు లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారికి ఎనలేని సేవలు చేసినారని ఆర్మూర్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా మహిళా సంఘాలు గ్రూపులు తయారుచేసి వారికి సేవలందించినారని కొన్ని వేల సంఘాలు తయారు చేసినారని ఇప్పటికీ ఎవరిని అడిగినా ఆయన తెలియని వారు అంటూ ఉండరని అటు మహిళా సంఘాల మహిళలకు గాని బీదవారికి కానీ ఆయన సేవలు చిరస్మరణీయమని మరువలేనివని, ఇలాగే అందరి మన్ననలు పొందుతూ రానున్న రోజుల్లో ఎన్నో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు మనస్ఫూర్తిగా అభినందించినారు అలాగే వారు బీసీ సెల్ అధ్యక్షులు మరియు జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న దొండి రమణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఆర్మూర్ పట్టణంలోని గల యూత్ సభ్యులు ఆయన జన్మదిన సందర్భంగా అనాధాశ్రమాల్లో పలుచోట్ల పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో పింజా అభినవ్, పసుపుల నరేష్, గుంజల సుమన్, పింజ రాజేష్, సన్నీ, కన్నం ప్రసాద్, దోండి నిశ్చయదీప్, రణతేజ్, వంశీ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెర్కిట్ లో ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మరియు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి సిబ్బంది కి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచనలు చేశారు.
ఆర్మూర్లో కోడి పందేలు ఆడుతున్నారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఎంక్వయిరీ చేయగా దూదేకుల కాలనీలో కోడి పందేలు ఆడుతున్న 13 మందిని పట్టుకుని వారి నుండి కోడి కత్తులు, 7380/- రూపాయలను, 11సెల్ ఫోన్ లు,4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది అని తెలిపినారు.
హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే ఖ్వాటర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు బైండ్ల ప్రశాంత్,ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్,అల్జాపూర్ కిరణ్ పాల్గొన్నారు.
నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ లో గల శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు . నరసింహనాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి, ఆమె మహిళలకు కూడా విద్య అవసరం అని చెప్పి విద్యారంగంలో మొదటి మహిళ గురువుగా ఎదిగింది అని చెప్పారు. పాఠశాల కరస్పాండ్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె గారు మహిళల హక్కుల కోసం సాధించడంలో మరియు విద్యా రంగంలో సాధించిన ప్రగతిలో ఒక వెలుగు, ఆమె జీవితం అనేక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసింహనాయుడు, పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాదు జిల్లా లోని ఆర్మూర్ లో గల ప్రాఖ్యాతి గాంచిన శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 43 వ వసంతోత్సవం పూర్వ విద్యార్థులు అనగా 1981 వ సంవత్సరాల నుండి 2024 వరకు గల విద్యార్థులు ఈ మహా సమ్మేళనం లో కలుసుకోని మరియు వారి యొక్క అనుభవలను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా శ్రీ ధర్మపురి అరవింద్, నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మాల్యే లు ఆర్మూర్ మరియు నిజామాబాదు పాల్గొనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మాజీ మంత్రి వర్యులు,ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి మరియు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారి మరియు ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆశిష్షులతో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి హార్ధిక శుభాకాంక్షలు.ఈ ఆర్మూర్ మార్కెట్ యార్డ్ G. O. కాపీని మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి మరియు జిల్లా అధ్యక్షులు కో ఆప్షన్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల్ మోహన్ రెడ్డి గారి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హంధన్ గారి నుడ చైర్మన్ కేశవ వేణు గారి చేతుల మీదుగా సాయిబాబా గౌడ్ గారికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారు కౌన్సిలర్ కొంత మురళి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మల్ గోపి రవీందర్ రెడ్డి రాజు భాయ్ ఫాయీమ్ బాయ్, మైసిన్, ఎస్కే బబ్లు నటరాజ్ పాల్గొన్నారు
ఆర్మూర్ (నిజం The Truth): నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లోగల మినీ స్టేడియంలో నిజామాబాద్ఎ ఏస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీమతి నాగమణి ఆధ్వర్యంలో అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల నిజామాబాద్ జిల్లా హాకీ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి మరియు వచ్చే నెల ఒకటవ తేదీన కామారెడ్డి మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల U/17 బాలురు మరియు బాలికల సెలక్షన్స్ కు ఈ యొక్క జట్టు ఎంపిక చేయడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు ఎంపికైన జట్టు నవంబర్ ఒకటవ తేదీన జరగబోయే ఉమ్మడి జిల్లాల ఎంపికకు వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియలో సదమస్తుల రమణ ఫిజికల్ డైరెక్టర్ , పింజ సురేందర్ ఫిజికల్ డైరెక్టర్, డి చిన్నయ్య ఫిజికల్ డైరెక్టర్, డాక్టర్ స్వామి ఫిజికల్ డైరెక్టర్, నాగేష్ ఫిజికల్ డైరెక్టర్. మరి ఈ కార్యక్రమంలో టీ.జి పేట అధ్యక్షులు బి గోపిరెడ్డి, పీఈటీలు శ్రీకాంత్ సీనియర్ హాకీ క్రీడాకారిణి రాణి ఉపాధ్యాయులు ఆకుల గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు
నందిపేట్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది మధుకర్, సురేష్, సిరాజ్ మరియు షఫీ అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించే విధానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, హెచ్ ఓ డి లు కిషోర్, లావణ్య, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.