Tuesday, October 7, 2025
Home Blog Page 3

హిందువులను దుశించడం ఫై ఆర్మూర్ ఎమ్మాల్యే ఫై కేసు?

0

నిజం (the truth) : 1సికింద్రాబాద్ లో ని ముత్యాల్లమ్మ ఆలయంలో జరిగిన సంఘటనలో హిందువులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఫై భారతీయ రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఎమ్మాల్యే ఫై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పూజ నరేందర్ మాట్లాడుతూ, ఆర్మూర్ ఎమ్మాల్యే హిందువులపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు అని హిందువులను నప్పున్సాకులని, చెతకానివారని మాట్లాడటం సరికాదు, అతను ఒక హిందువు అయి తోటి హిందువులను కించపరచడం సరికాదు. ఎమ్మాల్యే అనే అధికారం తో ప్రజలలో మతోన్మాదన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియలో మాట్లాడడం యువకుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు అని తెలిపినారు. ఈ కార్యక్రమం లో పూజ నరేందర్ మరియు బా. రా.స కార్యకర్తలు పాల్గొన్నారు.

  1. ↩︎

మగ్గిడి లోగాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

0

ఆర్మూర్ మండలం లోని మగ్గిడి గ్రామంలో గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు పశు వైద్య శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది అని తెలిపినారు. ఇట్టి కార్యక్రమం లో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు మగ్గిడి గ్రామంలో సుమారు 400 పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది.రేపు ఇదే కార్యక్రమం కోమన్ పల్లి గ్రామంలో కొనసాగుతుంది. కావున కోమన్ పల్లి గ్రామ పాడి రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని డాక్టర్ లక్కం ప్రభాకర్, మండల పశుసంవర్థకశాఖ అధికారి, ఆర్మూర్ మండలం తెలిపినారు.

గ్రూప్ -1 పరీక్షలకు హైకోర్టు పచ్చజండా

0

తెలంగాణాలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యాదవిధిగా జరగనున్నాయి. గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో 7ప్రశ్నలకు ఫైనల్ కీ లో సరైన జవాబు ఇవ్వలేదని, వాటికీకూడా మార్కులు కలపాలని కొందరు పిటిషన్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ లను కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యాదవిధిగా జరగనున్నాయి.

అనంచిన్ని..
కారుపై దాడి చంపటమే లక్షమా.?

0

అనంచిన్ని..
కారుపై దాడి

★ కాపాడిన జర్నలిస్టుల సమావేశం

★ తప్పిన పెను ప్రమాదం

★ చంపటమే లక్షయమా.?

హైదరాబాద్ (నవ యువ తెలంగాణ)

తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని జర్నలిస్ట్, పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర, కుంభకోణాలు రాయటంలో ఆరితేరిన యోధుడు, డబ్బు ప్రలోభానికి లోను కాడు, అహంకారం ఉండదు, ఆహార్యం మారదు, మొఖంలో చిరునవ్వు చెరగదు, బెదిరింపులకు భయపడడు, రాసిన రాతలకు జైళ్ళ నోళ్ళు తెరిస్తే ఆనందంగా వందల పుస్తకాలతో జైళ్ళకు వెళతాడు. స్వాతంత్ర్య పోరాటం తర్వాత పరిశోధన వార్తల కారణంగానే అత్యధిక రోజులు జైళ్ళలో గడపిన అద్భుతమైన చెరగని చరిత్ర. కనీసం ఒక్కరోజు కూడా జైళ్ళో జైలు కూడు తినని పట్టుదల, భౌతిక దాడులు కొత్త కాదు, మరణానికి వెరవని ధైర్యం ఆయన సొంతం. నిఖార్సయిన వార్తలకు ఆయన కేరాఫ్ అడ్రస్ వెరసి ఆయన పేరు అనంచిన్ని వెంకటేశ్వరరావు.

అసలేం జరిగింది.?

గత కొన్ని రోజులుగా అనంచిన్ని వెంకటేశ్వరరావు ‘ప్రీ లాంచ్’ ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది ఠోట్లు కొల్లగొట్టిన “రియల్ ఎస్టేట్ ఫేక్” సంస్థలపై వరుస పరిశోధన కథనాలను అందిస్తున్నారు. బెదిరింపులు సహజం. అయితే బెదిరింపులకు భయపడక పోవడంతో కాళ్ళ బేరానికి ఒకరిద్దరు వచ్చారు. ఈ ముసుగులో ఏకంగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. అయితే అది ఎవరు చేసిందనేది ఇంకా నిర్థారణ కాలేదు.

కారుపై దాడి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుకు చెందిన వాహనంపై దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఆ వాహనంలో ఎవరూ లేకపోవడంతో కారు అద్దాలు పగలటం మినహా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ సమయంలో అనంచిన్ని, ఆయన మిత్రులు ‘సేఫ్’ అయ్యారు.

ఇది రెండోసారి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుపై దాడి జరగడం ఇది రెండోసారి. ఒకసారి బషీర్ బాక్ ప్రెస్ క్లబ్ వద్ద 2004లో జరిగింది. కేసు ఫైల్ అయింది. నిందితులు ఇప్పటిదాకా దొరకలేదు. ఇటీవల కాలంలో దాడులు తగ్గించి కేసుల లింక్ మొదలెట్టారు. దానికి కూడా అనంచిన్ని వ్యూహాత్మకంగా ‘చెక్’ పెట్టారు. భవిష్యత్తులో ఆ,యా వ్యక్తులు, అధికారులు ‘వందల కోట్లకు ‘డిప్రమేషన్’ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఆఫీస్ అసిస్టెంట్ శ్రీకాంత్ తెలిపారు.

సేప్టీ కోసం మరో రెండు కార్లు..

ఇదిలా ఉండగా అనంచిన్ని వెంకటేశ్వరరావుకు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేదు. ఉండదు. అందుకే ఆయన భద్రత విషయంలో ‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ ఏకంగా కొత్తగా విడుదలైన రెండు కార్లను బుక్ చేసింది. ఈ కార్ల ప్రత్యేకత ఏమిటంటే 360 డిగ్రీల కెమెరా నిఘా ఉంటుంది.

మరో వారంలో కొత్త కారు ఇస్తాం..
‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ సంస్థ తరఫున రెండు కార్లు బుక్ చేసిన మాట యథార్థమని, ఈ అత్యాధునిక కారు కోసం ఏడాదిన్నరద వేచి చూడాలని అయితే పరిస్థితి అంచనాలోకి తీసుకొని మరో వారంలోనే కొత్త కారు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు, తమ కస్టమర్ల విషయంలో తాము పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటామని, కస్టమర్ల కోసం తాము కట్టుబడి ఉంటామని ప్రముఖ కంపెనీ మహేంద్ర బాద్యులు, ప్రముఖ వ్యాపారవేత్త వివిసి రాజు స్పష్టం చేశారు.

తీవ్రంగా ఖండించిన టిజెఎస్ఎస్..

ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావును బెదిరించన ఆడియో ఒకవైపు హల్చల్ చేస్తుండగా దాడి జరగటం పై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

లేడీ కానిస్టేబుల్ కోసం గొడవ పడ్డ సిఐ, కానిస్టేబుల్….!!!

0

నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భీమవరంలో ఇద్దరు పోలీసుల తీరు తీవ్ర వివాస్పదమవుతుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో డిపార్ట్మెంట్ పరువు పోతోంది. తాజాగా భీమవరం వన్ టౌన్ స్టేషన్లో సిఐకి కానిస్టేబుల్ కి మధ్య చెలరేగిన వివాదం ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణభగవాన్ స్టేషన్లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ వారిని అకారణంగా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజేష్ అనే కానిస్టేబుల్ స్టేషన్లోని మరో లేడీ కానిస్టేబుల్ కు బైక్ పై లిఫ్ట్ ఇస్తున్నాడనే కారణంతో అతన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయంలో కానిస్టేబుల్ రాజేష్ కు మధ్య ఘర్షణ సైతం చోటు చేసుకుంది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం సీఐ కృష్ణ భగవాన్ ను వెకెన్సీ రిజర్వ్ కు పంపించడంతో పాటు కానిస్టేబుల్ ను భీమవరం నుంచి మొగల్తూరు స్టేషన్ కు బదిలీ చేసారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు చిన్నచిన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధపెడుతూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలిసింగ్ తో నేరాలు అదుపు చేయాల్సిన పోలీసుల మధ్య సఖ్యత ఉండట్లేదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం..

0

నవ యువ తెలంగాణ:మహబూబాబాద్ టౌన్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం
పది రోజుల క్రితం అనారోగ్య బారిన పడి నరసింహులపేట మండలం కౌసల్య దేవి పల్లి కి చెందిన ఏర్పుల యాకయ్య ఆసుపత్రిలో చేరిక
వైద్యం సరిగా అందక ఎప్పుడు మృతి చెందాడో కూడా తెలియని దుస్థితి
మృతుడి కుటుంబీకులు పరిశీలించి వైద్యులకు చెప్పే అంతవరకు తిరిగి చూడని వైనం.
వైద్యుల నిర్లక్ష్యం తోనే మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళన
ఠాగూర్ సినిమాని తలపించిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబంతో పాటు పలురు డీమాండ్

అర్ధరాత్రి అధికారుల ఆకస్మిక సందర్శన…!!

0

నవయువ తెలంగాణ: గూడూర్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని
బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు..

గూడూరు మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం లో
కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురి అయిన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి సంఘటన తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు అర్ధరాత్రి హాస్టల్ నీ తనకి చేసిన వారిలో డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య తహసిల్దార్ అశోక్ కుమార్ ఏటీడీవో భాస్కర్ సందర్శించార అయోధ్య పురం పీహెచ్సీ వైద్యులు సాయినాథ్ వైద్య సిబ్బంది తదితరులు సందర్శించారు…

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం…!!

0

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం

TS: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం జరిగింది. తనపై హోంగార్డు అత్యాచారం చేశాడని మహిళా ఎస్సై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని పేర్కొంది. మొబైల్ వీడియో తీసి రూ.50,00,000 డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది.