Tuesday, October 7, 2025
Home Blog Page 5

భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక..

0

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక మండలం లోని పలు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలలో బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు పర్యటించారు. చింతల బయ్యారం, రావి గూడెం, బయ్యారం పంచాయతీలోని నాటుకు సిద్ధంగా ఉండి గోదావరిలో మునిగి కొట్టుకుపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. సోమవారం బయ్యారం గ్రామానికి చెందిన రైతు బ్రహ్మారెడ్డి సాగుచేస్తున్న నీట మునిగిన వరి నారుమడి తో పాటు పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.అనంతరం ఏఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లోని నీటమునిగిన వివిధ రకాల పంటలను పరిశీలిస్తున్నామని, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం పంటలు ఇంకా నారు దశలో ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మణ్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం….

0

ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం….

తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద పరిస్థితిపై చర్చించేందుకు.
రాష్ట్రంలోని విపరీత వరద పరిస్థితుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరియు తీవ్రంగా నష్టపోతున్నారు.

11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి.
తెలంగాణ పరిస్థితి జాతీయ విపత్తు గా ప్రకటించి 2000 కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి.
విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీతక్క…

0

కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే ఓటు వేశాను: ఎమ్మెల్యే సీతక్క

నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని… క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు నాకు లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందని… దీంతో కొత్త బ్యాలెట్ పేపర్ అడుగగా, వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేసినట్లు సీతక్క పేర్కొన్నారు.