
ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ పుట్టినరోజు సందర్భంగా వారిని స్వగృహం లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ అగర్వాల్,31 కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వడ్లురి సుమన్ యువజన కాంగ్రెస్ నాయకులు అల్జాపూర్ కిరణ్ , తదితరులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ రమణగారు నిజమైన కాంగ్రెస్ నాయకునిగా ఉన్నారని పార్టీ కి ఎనలేని సేవలు చేసారని, ఎందరో ఎన్నో పార్టీలు మారిన తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీలోనే ఉన్నారంటూ మరియు ఆయన ఆర్మూర్లో మహిళా సంఘాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎలాంటి రిమార్కు లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారికి ఎనలేని సేవలు చేసినారని ఆర్మూర్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా మహిళా సంఘాలు గ్రూపులు తయారుచేసి వారికి సేవలందించినారని కొన్ని వేల సంఘాలు తయారు చేసినారని ఇప్పటికీ ఎవరిని అడిగినా ఆయన తెలియని వారు అంటూ ఉండరని అటు మహిళా సంఘాల మహిళలకు గాని బీదవారికి కానీ ఆయన సేవలు చిరస్మరణీయమని మరువలేనివని, ఇలాగే అందరి మన్ననలు పొందుతూ రానున్న రోజుల్లో ఎన్నో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు మనస్ఫూర్తిగా అభినందించినారు అలాగే వారు బీసీ సెల్ అధ్యక్షులు మరియు జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న దొండి రమణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఆర్మూర్ పట్టణంలోని గల యూత్ సభ్యులు ఆయన జన్మదిన సందర్భంగా అనాధాశ్రమాల్లో పలుచోట్ల పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో పింజా అభినవ్, పసుపుల నరేష్, గుంజల సుమన్, పింజ రాజేష్, సన్నీ, కన్నం ప్రసాద్, దోండి నిశ్చయదీప్, రణతేజ్, వంశీ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.