ఆర్మూర్ మండలం లోని మగ్గిడి గ్రామంలో గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు పశు వైద్య శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది అని తెలిపినారు. ఇట్టి కార్యక్రమం లో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు మగ్గిడి గ్రామంలో సుమారు 400 పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది.రేపు ఇదే కార్యక్రమం కోమన్ పల్లి గ్రామంలో కొనసాగుతుంది. కావున కోమన్ పల్లి గ్రామ పాడి రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని డాక్టర్ లక్కం ప్రభాకర్, మండల పశుసంవర్థకశాఖ అధికారి, ఆర్మూర్ మండలం తెలిపినారు.
