నిజం (the truth) : 1సికింద్రాబాద్ లో ని ముత్యాల్లమ్మ ఆలయంలో జరిగిన సంఘటనలో హిందువులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఫై భారతీయ రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఎమ్మాల్యే ఫై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పూజ నరేందర్ మాట్లాడుతూ, ఆర్మూర్ ఎమ్మాల్యే హిందువులపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు అని హిందువులను నప్పున్సాకులని, చెతకానివారని మాట్లాడటం సరికాదు, అతను ఒక హిందువు అయి తోటి హిందువులను కించపరచడం సరికాదు. ఎమ్మాల్యే అనే అధికారం తో ప్రజలలో మతోన్మాదన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియలో మాట్లాడడం యువకుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు అని తెలిపినారు. ఈ కార్యక్రమం లో పూజ నరేందర్ మరియు బా. రా.స కార్యకర్తలు పాల్గొన్నారు.