
నందిపేట్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది మధుకర్, సురేష్, సిరాజ్ మరియు షఫీ అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించే విధానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, హెచ్ ఓ డి లు కిషోర్, లావణ్య, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.