
ఆర్మూర్ (నిజం The Truth): నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లోగల మినీ స్టేడియంలో నిజామాబాద్ఎ ఏస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీమతి నాగమణి ఆధ్వర్యంలో అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల నిజామాబాద్ జిల్లా హాకీ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి మరియు వచ్చే నెల ఒకటవ తేదీన కామారెడ్డి మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల U/17 బాలురు మరియు బాలికల సెలక్షన్స్ కు ఈ యొక్క జట్టు ఎంపిక చేయడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు ఎంపికైన జట్టు నవంబర్ ఒకటవ తేదీన జరగబోయే ఉమ్మడి జిల్లాల ఎంపికకు వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియలో సదమస్తుల రమణ ఫిజికల్ డైరెక్టర్ , పింజ సురేందర్ ఫిజికల్ డైరెక్టర్, డి చిన్నయ్య ఫిజికల్ డైరెక్టర్, డాక్టర్ స్వామి ఫిజికల్ డైరెక్టర్, నాగేష్ ఫిజికల్ డైరెక్టర్. మరి ఈ కార్యక్రమంలో టీ.జి పేట అధ్యక్షులు బి గోపిరెడ్డి, పీఈటీలు శ్రీకాంత్ సీనియర్ హాకీ క్రీడాకారిణి రాణి ఉపాధ్యాయులు ఆకుల గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు