
నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ లో గల శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు . నరసింహనాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి, ఆమె మహిళలకు కూడా విద్య అవసరం అని చెప్పి విద్యారంగంలో మొదటి మహిళ గురువుగా ఎదిగింది అని చెప్పారు. పాఠశాల కరస్పాండ్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె గారు మహిళల హక్కుల కోసం సాధించడంలో మరియు విద్యా రంగంలో సాధించిన ప్రగతిలో ఒక వెలుగు, ఆమె జీవితం అనేక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసింహనాయుడు, పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.