ఆర్మూర్ లోని పలు దుకాణాలపై ప్లాస్టిక్ తనిఖీలు నిర్వహించడంతోపాటు పలు బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరియు హోటల్స్ లలో పరిశుభ్రత పై తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ తనిఖీలలో పట్టుబడిన ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించడం జరిగినది మరియు పట్టణంలోని 25 వ వార్డులో మహిళలకు తడి, పొడి మరియు హానికర చెత్తను విభజించి మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరు చెత్తను తడి,పొడి మరియు హానికర చెత్తగా విభజించి మునిసిపల్ వాహనాలకు అందించాలని హోటల్లు దుకాణాల వారు పరిశుభ్రతను పాటిస్తూ సింగిల్ ప్లాస్టిక్‌ను వాడకూడదని లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధించబడునని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, వార్డ్ ఆఫీసర్ సింధుజ ,ఆర్పీ లావణ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
