నిజం the truth : నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమీషనర్ ఆదేశాలతో మామిడిపల్లి ఏరియాలో పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు హోటల్స్ పై సింగిల్ యూస్ ప్లాస్టిక్ మరియు పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పట్టుబడిన ప్లాస్టిక్ ని స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించడం జరిగింది ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది అక్షయ్, నరసయ్య పాల్గొన్నారు.