(నిజం the truth): (March 13): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల హాకీ ఎంపికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ మాట్లాడుతూ తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆదేశాల మేరకు మార్చ్ 16,17,18 వ తేదీలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్ కు నిజామాబాద్ జిల్లా జట్టు ఎంపికలు ఈరోజు నిర్వహించడం జరిగింది మరియు ఎంపికైన జట్టు ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం హుజరాబాద్ కు బయలుదేరుతుందని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన జట్టును అభినందిస్తూ, మరియు రాష్ట్రస్థాయిలో మన జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ యొక్క ఎంపిక ప్రక్రియను జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రా అంజు మరియు ఈసీ మెంబర్స సడక్ నాగేష్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు జిన్నా గంగాధర్, నర్సింగ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.