
ఆర్మూర్ పట్టణానికి చెందిన సదమస్తుల రమణ (ఫిజికల్ డైరెక్టర్) సదమస్తుల సంధ్యారాణి దంపతుల కుమార్తె సదమస్తుల శ్రీయాన్షి ఈనెల 26వ తేది ఏప్రిల్ 2025 నాడు దుబాయ్, హ్యాబిటేట్ స్కూల్, అజ్మన్ లో జరగబోయే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్, దుబాయ్ 2025 సంవత్సరం నకు గాను అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైందని వీరి తల్లిదండ్రులు తెలియజేశారు. ఆర్మూర్ లోని నటరాజ నృత్య నికేతన్, డాక్టర్ మృణాళిని వద్ద శ్రీయాన్షి శిక్షణ పొందుతుందని తెలియజేశారు. ఆర్మూర్ లోని మోడల్ స్కూల్లో ఇటీవలే ఏడవ తరగతి పూర్తి చేసిందని తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయి దుబాయిలో పాల్గొంటున్నటువంటి శ్రీయన్షి ని వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు అభినందించడం జరిగింది.