నందిపేట్ మండలం లోని నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నందిపేట్. ఎస్ ఐ ఎం.చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నందిపేట్ లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎం.చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొని చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలు, శిక్షలు వివరించారు. హెల్మెట్ వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాఫిక్ నిబంధనలు, యాంటీ రాగింగ్, డయల్ 100 యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, పరిపాలన అధికారి తులసి రామ్, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ లక్ష్మణ్ శాస్త్రి, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
