ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు స్వాగతం.
— టియుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్.
ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ గారిని టియుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ తో పాటు బొడమీది నరేష్, గట్టడి పవన్, పోలపల్లి రాజేష్ మరియు వారి బృందం మర్యాదపూర్వకంగా కలిసి పూలమల శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.
ఆర్డిఓ గా విధులు నిర్వహించిన శ్రీ రాజా గౌడ్ గారికి పూలమాల శాలువాతో వీడ్కోలు ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా జిల్లా టియుడబ్ల్యూజే,ఐజేయు ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆర్డీవో గ రాజగౌడ్ విధులు అభినందనీయమని పేర్కొన్నారు.
అలాగే నేడు ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అభిగ్యాన్ మాళవీయ కు జర్నలిస్టుల సమస్యల గురించి వివరించారు.